జగన్ కేసులో ఐఏఎస్ కు ఊరట

First Published 10, Apr 2018, 9:40 AM IST
Big relief for another IAS officer in Ys Jagans disproportionate assets case
Highlights
ఆయనపై జరుగుతున్న విచారణ ప్రక్రియను కోర్టు నిలిపేసింది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితునిగా ఉన్న అప్పటి ఐఏఎస్ అధికారి మురళీధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై జరుగుతున్న విచారణ ప్రక్రియను కోర్టు నిలిపేసింది.

ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలంటూ సిబిఐను కోర్టు ఆదేశించింది. జగన్ కంపెనీల్లో లేపాక్షి నాలెడ్జి హబ్ కు సంబంధించి సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్లో మురళీధర్ రెడ్డి 12వ నిందితునిగా ఉన్నారు.

జగన్ అక్రమాస్తుల కేసుల్లో పలువురు ఐఏఎస్ అధికారులపై ఉన్న కేసులను కోర్టు కొట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే.

అక్రమాలు జరిగిందనో లేకపోతే అవినీతి జరిగిందనో సరైన సాక్ష్యాధారాలు సమర్పించలేకపోతోందని కొన్నిసార్లు సిబిఐపై  కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయ్. మొత్తం మీద జగన్ కేసుల్లో ఒక్కో ఐఏఎస్ అధికారిపై నమోదైన కేసులను కోర్టు కొట్టేస్తోంది. 

అదే సమయంలో పలువురు పారిశ్రామికవేత్తలపై నమోదైన కేసులపై విచారణను కూడా నిలిపేస్తోంది.

మొత్తం మీద ఎన్నికలకు ముందు అన్నీ కేసుల నుండి జగన్ కు ఊరట లభిస్తుందని వైసిపి వర్గాలు ఎదురుచూస్తున్నాయ్

loader