చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్.. కాసేపట్లో భువనేశ్వరి ప్రెస్‌మీట్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణిలు.. అక్కడి సంబంధిత ప్రక్రియ అనంతరం లోనికి వెళ్లారు. చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. దాదాపు 30 నిమిషాలకు పైగా ఈ ములాఖత్ ఉంటుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్యం, కుటుంబ విషయాలతో పార్టీ అంశాలు, భవిష్యత్తు కార్యాచరణ చర్చకు వచ్చే అవకాశం ఉంది.
చంద్రబాబుతో ములాఖత్ అనంతరం భువనేశ్వరి మీడియాతో మాట్లాడనున్నట్టుగా తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఆమె మీడియాతో ఏం మాట్లాడతారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే చంద్రబాబును జ్యూడిషయల్ రిమాండ్ తరలించే సమయంలో ఆయనను కలిసిన భువనేశ్వరి భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆమె చంద్రబాబును కలుస్తున్నారు. ఇక, ఈ రోజు మధ్యాహ్నం లాయర్ లక్ష్మీనారాయణ లీగల్ ములాఖత్‌లో భాగంగా చంద్రబాబుతో భేటీ అయిన సంగతి తెలిసిందే.