దివంగత భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఆస్తి కోసం భూమా కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. తాను మైనర్‌గా వున్నప్పుడు స్థలాలు అమ్మారంటూ అక్కలపై కోర్టుకెక్కాడు తమ్ముడు భూమా జగద్విఖ్యాత్ రెడ్డి.
దివంగత భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఆస్తి కోసం భూమా కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. తాను మైనర్‌గా వున్నప్పుడు స్థలాలు అమ్మారంటూ అక్కలపై కోర్టుకెక్కాడు తమ్ముడు భూమా జగద్విఖ్యాత్ రెడ్డి. ఈ మేరకు తనకు న్యాయం చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. భూ కొనుగోలుదారులు, అక్కలపై ఫిర్యాదు చేశాడు జగద్విఖ్యాత్ రెడ్డి. హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లోని వెయ్యి గజాల స్థల వివాదంపై ఈ గొడవ జరుగుతున్నట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
