జగన్ ప్రభుత్వానికి హైకోర్టు చెంపదెబ్బ... విశాఖ పోలీసులపైనే కేసులు: అఖిలప్రియ

దళిత డాక్టర్ సుధాకర్ కేసు విషయంలో  హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. 

bhuma akhila priya reacts ap high court judgement on doctor sudhakar issue

కర్నూల్: దళిత డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు తీర్పు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టని మాజీ మంత్రి, టిడిపి నాయకురాలు భూమా అఖిలప్రియ మండిపడ్డారు. ఆయనపై ప్రభుత్వం అక్రమంగా బనాయించిన కేసుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని... ఆయన పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన  విశాఖ పోలీసులపై కేసు నమోదు చేయమని హైకోర్టు ఆదేశించడం సంతోషదాయకమన్నారు. 

''పోలీస్ వ్యవస్థకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. వైసీపీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయి. వైసీపీ అరాచక చర్యలను అనేకసార్లు కోర్టులు తప్పుబట్టినా జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలిలో ఎలాంటి మార్పు రాలేదు. గతంలో విశాఖ పోలీసులు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పై అప్రజాస్వామికంగా వ్యవహరించినందుకు డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్ ను హైకోర్టు మందలించినా వారిలో మార్పు రాలేదు'' అని అన్నారు. 

read more  లీడ్ క్యాప్ భూముల కోసం... నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుచేసిన టిడిపి

''జగన్ ప్రభుత్వం చేసే కక్ష సాధింపు చర్యలకు పోలీసు వ్యవస్థ చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి వచ్చింది.  గతంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల చేత తప్పులు చేయించి వారి ప్రతిష్టకు, వారి భవిష్యత్ కు జగన్ మచ్చ తెచ్చిన విషయం ఉదాహరణగా ఉంది. దీని నుంచైనా నేటి పోలీస్ వ్యవస్థ నేర్చుకుని జగన్ ఒత్తిడిల ప్రకారం కాకుండా చట్ట ప్రకారం నడుచుకోవాలి'' అని సూచించారు. 

''పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న జగన్ చర్యలను ప్రజలు, మేధావులు నిరసలు తెలియజేయడం, ఖండించడం ఆహ్వానించదగ్గర పరిమాణం'' అని భూమా అఖిలప్రియ
 అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios