భీమిలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

ఉత్తరాంధ్రలో ఈసారి వైసిపి, టిడిపి కూటమికి మధ్య  గట్టి పోటీవున్న నియోజకవర్గాల్లో భీమిలి ఒకటి. ఇక్కడ ప్రస్తుతం మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) ఎమ్మెల్యేగా వున్నారు. గతంలో ఇక్కడినుండే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ప్రాతినిధ్యం వహించారు. మరోసారి వీరిద్దరే  బరిలో దిగడంతో భీమిలి పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారాయి. 

Bheemili assembly elections result 2024 AKP

భీమిలి నియోజకవర్గ రాజకీయాలు :

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదరడంతో మొదట భీమిలి సీటుపై సందిగ్దత నెలకొంది. ఇక్కడినుండి పోటీకి టిడిపి, జనసేన పార్టీలు ఆసక్తి చూపించాయి. కానీ చివరకు ఈ సీటునే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టుబట్టడంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఒప్పుకోక తప్పలేదు. గంటాను చీపురుపల్లి పంపించి మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయించాలన్న చంద్రబాబు ప్రయత్నాలు ఫలించలేవు. ఎట్టకేలకు భీమిలి నుండి మరోసారి గంటా పోటీకి సిద్దమయ్యారు. 

మరోవైపు భీమిలిలో మరోసారి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీల్లో కలిసి పనిచేసిన  ఈ ఇద్దరు ఇప్పుడు భీమిలిలో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.  


భీమిలి నియోజకవర్గ పరిధిలోని  మండలాలు :

1. విశాఖపట్నం రూరల్
2. ఆనందపురం
3.  పద్మనాభం
4. భీమిలి

భీమిలి అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 3,07,144   
పురుషులు -    1,53,298
మహిళలు ‌-    1,53,827

భీమిలి అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

మరోసారి భీమిలి అసెంబ్లీ బరిలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ నిలిచారు. 2009 లో ప్రజారాజ్యం, 2019 లో వైసిపి నుండి ఇదే భీమిలిలో పోటీచేసి గెలిచారు అవంతి. ముచ్చటగా మూడోసారి భీమిలి నుండే పోటీ చేస్తున్నారు అవంతి శ్రీనివాస్. 

 
టిడిపి అభ్యర్థి : 

భీమిలిలో సీటు కోసం టిడిపి, జనసేన పార్టీలు పోటీపడ్డాయి. చివరకు ఇక్కడ పోటీకి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తి చూపించడంలో జనసేన వెనక్కి తగ్గింది.  
 
భీమిలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

భీమిలి అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 2,17,794  (94 శాతం)

వైసిపి - ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) - 1,01,629 ఓట్లు (44 శాతం) - 9,712 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - సబ్బం హరి - 91,917 ఓట్లు (39 శాతం) - ఓటమి
 
జనసేన పార్టీ ‌-  పంచకర్ల నాగ సందీప్ - 24,248 (10 శాతం)

 
భీమిలి అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 2,11,826 ఓట్లు (75 శాతం)


టిడిపి - గంటా శ్రీనివాసరావు - 1,18,020 (40 శాతం) - 37,226 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - కర్రి సీతారాం- 81,794 (34 శాతం) - ఓటమి


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios