శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి దాడి:మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆదేశం
శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు-కడిసింగి గ్రామాల్లో ప్రజలపై ఎలుగుబంటి దాడి ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఎలుగు బంటి దాడిలో నిన్న ఒక్కరు మరణించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అప్పలరాజు హామీ ఇచ్చారు.
శ్రీకాకుళం: Srikakulam జిల్లాలోని Palasa నియోజకవర్గం వజ్రపుకొత్తూరు - కిడిసింగి గ్రామాలలో ప్రజలపై Bear Attack దాడి ఘటన పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి డాక్టర్ సీదిరి Appala Raju.ఎలుగుబంటి దాడితో నిన్న ఒకరు Dead చెందారు. ఆరుగురుపై తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు శ్రీకాకుళం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎలుగు బంటి దాడి గురించి మంత్రి ఫారెస్ట్, పోలీస్, రెవిన్యూ అధికారులతో మాట్లాడారు. ఎలుగుబంటిని పట్టుకోవాలని కూడా మంత్రి ఆదేశించారు. vajrapukotturu పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. ఎలుగుబంటిని పట్టుకొనేవరకు ఎవరూ ఒంటరిగా బయట తిరగవద్దని కూడా మంత్రి విజ్ఞప్తి చేశారు.
శ్రీకాకుళం లోని మెడీకవర్ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యశాఖాధికారి, జిల్లా ఫారెస్ట్ అధికారి, రెవెన్యూ అధికారి, వైద్యులు ఇతర అధికారులతో కలిసి క్షతగాత్రులను పరామర్శించారు మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
క్షతగాత్రుల వైద్యానికి అవసరమైన పూర్తి ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ప్రకటించారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి తక్షణ సాయం కింద రూ. 2.5లక్షలు రూపాయలు చెల్లిస్తామని అనంతరం మరొక 2.5లక్షలు రూపాయలు మొత్తంగా ప్రభుత్వం తరపున 5లక్షల రూపాయలు పరిహారం చెల్లిస్తామని చెప్పారు.బాధిత కుటుంబాలకు పూర్తి అండగా ఉంటామని మంత్రి డాక్టర్ సీదిరి అన్నారు