ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో 1000 పడకలతో బసవతారకం కేన్సర్ ఆస్పత్రికి నిర్మించనున్నట్లు ఇదివరకే ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రకటించింన విషయం తెలిసిందే. ఈ ఆస్పత్రి కోసం ప్రభుత్వం రాజధాని పరిధిలోని తుళ్లూరులో 15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఈ ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేయాలని బాలకృష్ణ నిర్ణయించారు. 

ఇందుకోసం ఇప్పటికే తుళ్లూరులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. నూతన రాజధాని నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం బాలకృష్ణ ఇవాళ ఏపి శాసన సభ ప్రాంగణంలో అతిథులను ఆహ్వానిస్తూ కనిపించారు. గిరిజన మంత్రి శ్రావణ్ కుమార్ ను ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలంటూ బాలకృష్ణ స్వయంగా ఆహ్వానించారు.