సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లకు సంబంధించి సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావును అదుపులోకి తీసుకోలేదని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. రైల్వేస్టేషన్‌పై దాడి ఘటనలో సుబ్బారావును ప్రశ్నిస్తున్నామని చెప్పారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లకు సంబంధించి సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావును అదుపులోకి తీసుకోలేదని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. రైల్వేస్టేషన్‌పై దాడి ఘటనలో సుబ్బారావును ప్రశ్నిస్తున్నామని చెప్పారు. భారత్ బంద్ పిలుపు నేపథ్యంలో సోమవారం ఉదయం నరసరావుపేట రైల్వే స్టేషన్‌ను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా యన మీడియాతో మాట్లాడుతూ... అభ్యర్థులు నిరసన తెలిపి భవిష్యత్తు పాడు చేసుకోవద్దని సూచించారు. సుబ్బారావు విషయంలో తెలంగాణ పోలీసులు తమను సంప్రదించలేదని చెప్పారు.
యూపీ పోలీసులు సుబ్బారావును విచారించారించినట్టుగా వార్తలు వస్తున్నాయని మీడియా ప్రశ్నించగా.. అందులో వాస్తవం లేదని ఎస్పీ స్పష్టం చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు సుబ్బారావు విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.
ఇక, సాయి డిఫెన్స్ అకాడమీ పేరుతో సుబ్బారావు ఆర్మీ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం వెనక సుబ్బారావు కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం ఘటన వెనక ఉన్నది సుబ్బారావేనని.. ఆందోళనకారులను అతడే ప్రేరేపించాడని పోలీసులు గుర్తించినట్టుగా కూడా ప్రచారం సాగింది.
