నెల్లూరు జిల్లా పొదలకూరు ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ కీచకపర్వం వెలుగు చూసింది. మహిళల పట్ల అత్యంత అసభ్యకరమైన రీతిలో ప్రవర్తిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

హైదరాబాద్: మహిళా ఖాతాదారుల పట్ల ఓ బ్యాంక్ మేనేజర్ కీచకపర్వం వెలుగు చూసింది. నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో ఈ ఘటన జరిగింది. రుణం కావాలంటే తనకు లొంగిపోవాలని ఎస్బీఐ మేనేజర్ నగేష్ ఒత్తిడి పెట్టి మహిళా ఖాతాదారులను లోబరుచుకుంటున్నాడు. అతని రాసలీలలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ దృశ్యాలు తెలుగు టీవీ చానెళ్లలో ప్రసారమయ్యాయి. ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఎన్టీవీ ఈ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

గడువులోగా రుణాలు చెల్లించకపోతే మహిళా ఖాతాదారులను లైంగిక అతను వేధిస్తున్నట్లు బయటుపడింది. రుణాల కోసం వచ్చే మహిళలను కూడా ఆశపెట్టి అతను లొంగదీసుకుంటున్నాడు. మహిళల పట్ల వికృత చేష్టలు బయటపడ్డాయి. మహిళా ఖాతాదారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

మహిళలను తన గదిలోకి పిలిచి వారి ఆర్థికావసరాలను ఆసరా చేసుకుని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు చెబుతున్నారు. ఒంటరిగా మహిళలు బ్యాంక్ మేనేజర్ గదిలోకి వెళ్లడానికే భయపడుతున్నారు. మహిళల ఫోన్ నెంబర్లు తీసుకుని వారిని వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

సీసీటీవి కెమెరాలోని దృశ్యాలు మీడియా చానెల్స్ లో రావడంతో నగేష్ దొంగ మాదిరిగా బ్యాంక్ నుంచి వెళ్లిపోయాడు. వీడియో ఆధారంగా అతనిపై పోలీసులు కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పరారీలో ఉన్న నగేష్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లుగా కూడా తెలుస్తోంది.