ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలను కేంద్రప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హోదా సాధన సమితి శుక్రవారం ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు తెలుగుదేశం, సీపీఐ, విద్యార్ధి, కార్మిక సంఘాలు మద్ధతు ప్రకటించాయి. 

దీంతో ఈ ఉదయం నుంచే నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి చేరుకుని బంద్‌లో పాల్గొన్నారు. విశాఖ మద్దిలపాలెం జంక్షన్‌లో వామపక్షాలు, విద్యార్ధి సంఘాలు నిరసనకు దిగాయి. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్, ప్రత్యేకహోదా కోరుతు నినాదాలు చేశారు.

అటు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ఎదుట హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు సీపీఐ నేతలు నిరసనకు దిగారు. మరోవైపు బంద్‌కు మద్ధతుగా సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లబ్యాడ్జీలు ధరించి అసెంబ్లీకి హాజరుకానున్నారు. బంద్‌కు ఏపీ ఎన్జీవో సంఘం సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. జనసేన, వైసీపీ, బీజేపీలు బంద్‌కు దూరంగా ఉంటున్నాయి.