న్యూ ఇయర్ వేడుకలపై విజయవాడలో నిషేధం: విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు

కొత్త సంవత్సరం వేడుకలకు ఏపీ ప్రభుత్వం నో చెప్పింది. విజయవాడలోని హోటల్స్, ఫంక్షన్ హల్లోనూ కొత్త ఏడాది వేడుకలకు కూడ అనుమతి లేదని  విజయవాడ సీపీ  బత్తిన శ్రీనివాసులు తెలిపారు. 

ban on new year celebrations in Vijayawada says Vijayawada CP lns


విజయవాడ: కొత్త సంవత్సరం వేడుకలకు ఏపీ ప్రభుత్వం నో చెప్పింది. విజయవాడలోని హోటల్స్, ఫంక్షన్ హల్లోనూ కొత్త ఏడాది వేడుకలకు కూడ అనుమతి లేదని  విజయవాడ సీపీ  బత్తిన శ్రీనివాసులు తెలిపారు. ఇంట్లోనే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని నగర ప్రజలకు ఆయన సూచించారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా సీపీ చెప్పారు.  బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదని సీపీ ప్రకటించారు.కరోనా స్ట్రెయిన్ కారణంగా ప్రజలు రోడ్ల మీదికి రాకూడదని  సీపీ కోరారు. నగరంలోని బందరు రోడ్డులో ప్రజలు గుమికూడవద్దని రోడ్లపై కేక్ కోయడం వంటివాటిపై నిషేధించినట్టుగా ఆయన చెప్పారు.

ఈ నెల 31వ తేదీ రాత్రి 10 గంటలలోపుగా నగరంలోని వ్యాపార సంస్థలు, దుకాణాలు మూసివేయాలని సీపీ ఆదేశించారు. ఇప్పటికే తెలంగాణలోని హైద్రాబాద్ లో కూడ కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం విధించారు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా స్ట్రెయిన్ వైరస్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో రెండు , ఏపీ రాష్ట్రంలో  ఒక్క స్ట్రెయిన్ కేసు నమోదైంది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios