బాలినేని వర్సెస్ ఆమంచి : వైసీపీ సంతనూతలపాడు పరిశీలకుడు భవనంపై సస్పెన్షన్ వేటు..
ఒంగోలు వైసీపీలో వర్గపోరు మొదలయ్యింది. బాలినేని వర్సెస్ ఆమంచిగా జరుగుతున్న పోరులో భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.

ఒంగోలు : ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికలు తొందర్లోనే జరగనున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సొంత పార్టీలోనే విభేదాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ సంతనూతలపాడు పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన వెలువడింది. దీంట్లో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు భవనం శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.
శ్రీనివాసరెడ్డి బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన వాడు. మొదటినుంచి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అనుచరుడుగా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి భార్య జెడ్పిటిసి సభ్యురాలు. మరోవైపు పర్చూరు నియోజకవర్గ బాధ్యుడు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కి.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి.
అధికారుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని నోట్ రాసి.. గ్రామ సర్వేయర్ ఆత్మహత్యాయత్నం..
ఇంకోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డికి.. భవనం శ్రీనివాసరెడ్డి అత్యంత సన్నిహితుడు. దీంతో కక్షపూరితంగానే ఆమంచి కృష్ణమోహన్.. భవనం శ్రీనివాసరెడ్డిపై వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశాడని.. సస్పెండ్ చేయించినట్లుగా ప్రచారం జరుగుతుంది. దీంతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడుతున్నారు.
తన అనుచరుడైన భవనం శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి తీవ్రంగా పరిగణించారు. మాజీ మంత్రి అయిన బాలినేని జిల్లా పార్టీలో చోటుచేసుకున్న తాజా పరిణామాలను తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని.. అలా చేయకుండా తన అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఏమిటి అంటూ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు సస్పెండ్ చేసిన నాయకులను తిరిగి పార్టీలో చేర్చుకోవాలని బాలినేని సీఎంను కోరినట్లుగా ప్రచారం జరుగుతుంది.