తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందనుకున్న సీటు విశాఖ లోక్‌సభ స్థానం .. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్ధిగా సినీనటుడు నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ బరిలోకి దిగారు.

తొలిసారి ఎన్నికల పోటీలో నిలిచిన భరత్‌ ప్రచారంలోనూ, పోల్ మేనేజ్‌మెంట్‌లోనూ గట్టిగా ప్రయత్నించినా.. క్రాస్ ఓటింగ్ కారణంగా ఓడిపోయారు. ముఖ్యంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన నుంచి పోటీ చేయడం భరత్‌‌ ఓటమికి ప్రధాన కారణం.

అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ఇంత వరకు మీడియా ముందు రాని భరత్ తొలిసారి ఓటమిపై స్పందించారు. తాను క్రాస్ ఓటింగ్ కారణంగానే ఓడిపోయానని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి ద్వారా గుణపాఠం నేర్చుకుంటామని తెలిపారు.

ఎన్నికల్లో గెలిచ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నిలదీస్తామని భరత్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటామని తెలిపారు.