సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు భరత్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ వార్తలపై తాజాగా భరత్ క్లారిటీ ఇచ్చారు.

తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకుంటున్న స్పష్టం చేశారు. తన తాత ఎంవీవీఎస్ మూర్తి ఆశయాలు, ఆలోచనలతో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. ప్రజా జీవితంలోకి రావాలనుకుంటున్నట్లు చెప్పారు. టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే.. విశాఖ ఎంపీగా పోటీ చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆయన కాంక్షించారు. ఏపీలో రాజధాని అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తి చేయగల సమర్ధత నాయకుడు చంద్రబాబేనని.. ఈ విషయాన్ని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. 

నందమూరి బాలకృష్ణ కి ఇద్దరు కుమార్తెలు కాగా.. పెద్ద కుమార్తె బ్రహ్మణి.. నారా లోకేష్ ని వివాహం చేసుకుంది. చిన్న కుమార్తె తేజశ్విని ని శ్రీభరత్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.