రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టి రెచ్చ గొడుతుంది చంద్రబాబేనని నైమిశారణ్యం పీఠాధిపతి బాల బ్రహ్మానంద సరస్వతి మండిపడ్డారు. తన మనుషులతో విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. 29 కేసుల్లో టీడీపీ నేతలు ఆధారాలతో దొరకడమే దీనికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. 

హిందై మతంపై ఏ మాత్రం ప్రేమలేని వ్యక్తి చంద్రబాబు అని బ్రహ్మానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మా వాళ్లు నంది విగ్రహాన్ని తరలిస్తే తప్పేంటి అని ఆయన అనటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందని.. ఆయన్ని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని అన్నారు.

లేకపోతే మతాల మధ్య గొడవలు మరింత పెరుగుతాయని అన్నారు. బూట్లు వేసుకుని పూజలు చేసిన చంద్రబాబు ఇప్పుడు హిందూ ధర్మం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. విజయవాడలో ఆలయాలు కూలగొట్టించి, బాత్రూంలు కట్టించిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హిందూ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. దుర్గగుడికి రూ.70 కోట్లు రిలీజ్ చేయడం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు గుళ్లు కూలిస్తే, జగన్ కట్టిస్తున్నాడని ఇది సంతోషించాల్సిన విషయం అని అన్నారు.