Asianet News TeluguAsianet News Telugu

బద్వేలులో కిడ్నాప్ అయిన బాలిక ఆచూకీ లభ్యం.. విజయవాడలో గుర్తించిన పోలీసులు..

కడప జిల్లా బద్వేలులో విద్యార్థిని వెంకట సంజన(13) అదృశ్యం కేసును పోలీసులు చేధించారు. విజయవాడలో ఓ మహిళ వద్ద సంజనను బద్వేల్ పోలీసులు గుర్తించారు. 

badvel police rescue kidnapped girl in vijayawada
Author
First Published Oct 24, 2022, 11:11 AM IST

కడప జిల్లా బద్వేలులో విద్యార్థిని వెంకట సంజన(13) అదృశ్యం కేసును పోలీసులు చేధించారు. విజయవాడలో ఓ మహిళ వద్ద సంజనను బద్వేల్ పోలీసులు గుర్తించారు. మహిళ వద్ద నుంచి బాలికను రక్షించిన పోలీసులు.. అనంతరం బద్వేలుకు తరలించి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలు.. 10 రోజుల కింద బద్వేలుకు చెందిన సంజన్ కనిపించకుండా పోయింది. దీంతో సంజన తల్లిదండ్రులు బద్వేలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. 

ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలికను ట్రేస్ పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే బాలిను ఓ మహిళ ట్రాప్ చేసి.. నెల్లూరు తీసుకొచ్చినట్టుగా పోలీసులు నిర్దారణకు వచ్చారు. అనంతరం బాలికను విజయవాడకు తీసుకెళ్లినట్టుగా గుర్తించారు. ఈ క్రమంలోనే విజయవాడలో మహిళ వద్ద నుంచి బాలికను కాపాడారు. అనంతరం బలికను ప్రత్యేక వాహనంలో బద్వేలుకు తరలించారు. బాలికను అపహరించిన మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఆమె వెకన ఇంకా ఎవరైన ఉన్నారా? అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios