Badvel Assembly bypoll: కడప జిల్లా నేతలతో జగన్ భేటీ

కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికపై  ఏపీ సీఎం వైఎస్ జగన్ కడప జిల్లాకు చెందిన మంత్రులు, వైసీపీ ప్రజా ప్రతినిధులతో చర్చిస్తున్నారు. ఈ స్థానాన్ని నిలబెట్టుకొంటామని ఆ పార్టీ ధీమాతో ఉంది.

Badvel Assembly bypoll:YS Jagan meeting with kadapa district ysrcp leaders

కడప: కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ (badvel assembly bypoll) స్థానానికి జరిగే ఉప ఎన్నికపై ఏపీ సీఎం వైఎస్ జగన్  (ys jagan)పార్టీ నేతలతో చర్చిస్తున్నారు.కడప జిల్లాకు చెందిన మంత్రులు, వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు సీఎం క్యాంప్ కార్యాలయానికి గురువారం నాడు చేరుకొన్నారు. బద్వేల్ అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సబ్బయ్య (venkata subbaiah)సతీమణి డాక్టర్ దాసరి సుధను (dasari sudha) వైసీపీ బరిలోకి దింపుతుంది. ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా 2019లో పోటీ చేసిన ఓబులాపూరం రాజశేఖర్(obulapuram Rajashekar) పోటీ చేయనున్నారు.

also read:బద్వేల్‌లో పోటీపై పవన్‌తో చర్చిస్తాం: బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు

అక్టోబర్ 30వ తేదీన బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.  2019  ఎన్నికల్లో ఈ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధి డాక్టర్ వెంకట సుబ్బయ్య విజయం సాధించారు. అనారోగ్యంతో ఆయన ఇటీవల  మరణించారు.దీంతో వెంకట సుబ్బయ్య భార్య సుధను  వైసీపీ బరిలోకి దింపుతుంది.

బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి కడప జిల్లాకు చెందిన మంత్రులు, పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో జగన్ చర్చిస్తున్నారు. పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డికి ఈ ఉప ఎన్నిక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది.ఈ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకొంటామని వైసీపీ ధీమాతో ఉంది. కానీ ఈ స్థానంలో తమ ఉనికిని నిలుపుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios