Badvel assembly bypoll: జనసేన పోటీకి బీజేపీ గ్రీన్‌సిగ్నల్?
బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ పోటీ చేయాలనే దానిపై బీజేపీ, జనసేనలు చర్చిస్తున్నాయి. ఈ స్థానం నుండి పోటీ చేసే విషయమై జనసేన, బీజేపీ నేతలు చర్చిస్తున్నారు.
అమరావతి: బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ పోటీ చేయాలనే దానిపై బీజేపీ, జనసేలు చర్చిస్తున్నాయి. ఈ స్థానం నుండి జనసేనను పోటీ చేయాలని బీజేపీ సూచించిందని సమాచారం.అమరావతిలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజులు భేటీ అయ్యారు. బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీపై చర్చిస్తున్నారు.
బద్వేల్ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ 30 వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ సుధ పోటీ చేయనున్నారు. దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణే సుధ. ఇక టీడీపీ అభ్యర్ధిగా ఓబుళాపురం రాజశేఖర్ పోటీ చేస్తున్నారు.
ఈ స్థానం నుండి ఎవరు పోటీ చేయాలనే దానిపై బీజేపీ, జససేన నేతలు చర్చిస్తున్నారు. గతంలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. ఈ స్థానం నుండి పోటీ చేయడానికి జనసేన తీవ్రంగా ప్రయత్నించింది. కానీ జనసేనను ఒప్పించి బీజేపీ బరిలోకి దిగింది.ఇక ఈ దఫా బద్వేల్ అసెంబ్లీ స్థానంలో జనసేనను పోటీ చేయాలని బీజేపీ సూచించినట్టుగా సమాచారం. రెండు పార్టీల నేతల మధ్య సమావేశం ముగిసిన తర్వాత ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.