కాపుల మోసానికి నూతన ప్రయత్నం ప్రారంభించారన్న వైసీపి నేతలు. బాబు కాపులను మోసానికి కుట్రలు చేస్తు ఆత్మీయ సమ్మేళనం సభలేంటని ప్రశ్నించిన అంబటి రాంబాబు నంద్యాల ఎన్నికల్లో ఓట్ల కోసమే సరికొత్త డ్రామా అని ఎద్దేవా చేసిన ఎమ్మేల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు

కాపుల‌ను మోసం చెయ్య‌డానికి ప్ర‌భుత్వం మ‌రోసారి ప్ర‌య‌త్నం ప్రారంభిచిందా అంటే నిజ‌మ‌నే అంటున్నారు వైసీపి నేత‌లు. కాపుల‌ మోసానికి బాబు క‌ట్టుకున్నార‌ని వైసీపి నాయ‌కులు చంద్ర‌బాబును దుయ్య‌బ‌ట్టారు. చంద్ర‌బాబు కాపుల‌ను ఒక వైపు వేధిస్తు మ‌రోవైపు ఆత్మీయ స‌మ్మేల‌న స‌భ‌లు అన‌డం సిగ్గుచేటని వైసీపి నేత అంబ‌టి రాంబాబు విరుచుకుప‌డ్డారు, నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో భాగంగా వైసీపి నేత‌ల మీడియాతో మాట్లాడుతు చంద్ర‌బాబు పై ధ్వ‌జ‌మెత్తారు.

కాపుల అభివృద్దికి చంద్ర‌బాబు మంజునాథ క‌మీష‌న్‌ను వెయ్య‌లేదని స్ప‌ష్టం చేశారు అంబ‌టి. మంజునాథ క‌మీష‌న్‌కు కాపుల రిజ‌ర్వేష‌న్ కు ఎలాంటి సంబంధం లేదని ఆయ‌న పెర్కొన్నారు. కేవ‌లం బీసీల స్థితిగ‌తుల‌ను తెలుసుకోవ‌డానికి మాత్ర‌మే అని మంజునాథ కమీష‌న్‌ను నియ‌మించిన‌ట్లు ఆయ‌న పెర్కొన్నారు. కాపుల అభివృద్ది కోసం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నంచ‌డం లేద‌న్నారు. కాపుల అభివృద్దిని కోరుకునే వారైతే ముద్ర‌గ‌డ‌తో ఎందుకు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల ముందు కాపుల ఆత్మీయ స‌భ‌లు ఎంట‌ని ఆయన ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు కాపుల‌ను, బ‌లిజ‌ల‌ను వేదిస్తు వారితో ఆత్మీయ స‌భ‌లు ఎలా నిర్వ‌హిస్తార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. బాబు కాపుల ఓటు కోస‌మే స‌భ‌లు ఏర్పాటు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

కాపుల అభివృద్ది కోసం ఏనాడు ఆలోచించ‌ని బాబు నేడు మాత్రం ఎందుకు ఇంత‌లా త‌పిస్తున్నార‌ని అడిగారు ఎమ్మేల్సీ ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు. కాపులకు సాధ్యం కాక‌పోయినా 1000 కోట్లు ఇస్తామ‌న్న చంద్ర‌బాబు ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న ప్రశ్నించారు. ఎన్నిక‌ల ముందు కాపుల ఓట్ల కోసం ప్ర‌భుత్వం కుట్ర‌లు చేస్తుంద‌ని, అందులో భాగమే నేడు కాపుల ఆత్మీయ స‌మ్మేళ‌నం అంటు ఆయ‌న ఎద్దేవా చేశారు.