ఆ రోజు ఇంగ్లీష్ పలకడం కూడా చేతకాని రోజులలో తెలుగు వాళ్లకు ఇంగ్లీష్ నేర్పించే చర్య లు తీసుకున్నాను. ఇంజనీరింగ్ కాలేజీలు పెంచాను. హెటె క్ సిటి పెట్టాను. ప్రపంచమంతా వెల్లండని చెప్పాను.  అమెరికా వచ్చారు. ఈ రోజు ఇంత బాగుపడ్డారు.

భారతదేశం యువరక్తంతో ఉప్పొంగుతోందని, రెండంకెల వృద్ధి మరే దేశానికి సాధ్యం కాని రోజుల్లో దానిని సాధించి చూపిస్తున్నామని ప్రవాస తెలుగుదేశం వారిని ఉద్దేశించి అమెరికా లోని డల్లాస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి దేశంలోని మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 కల్లా దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి అత్యున్నత ప్రమాణాలు గల ప్రపంచ గమ్యస్థానంగా మలచాలని ముందుచూపుతో కృషి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. 


ఆంధ్రకు పెట్టుబడులురప్పించేందుకు అమెరికా లో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు నిన్న డల్లాస్ వచ్చారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది.

ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ సంతోషదాయకంగా వుండేలా చూస్తున్నామని, ఇందుకోసం సంతృప్తి సూచికపై దృష్టిపెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు.

రాజధాని కూడా లేకుండా కట్టుబట్టలతో బయటకు వచ్చామని, అయితే రైతుల సహకారంతో వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టేలే రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని అన్నారు. అమరావతి నిర్మాణం తన పూర్వజన్మ సుకృతంగా అభివర్ణించారు. ఒక నగరాన్ని నిర్మించడం, రాజధానిని నిర్మించడం వేర్వేరని, రాజధాని నిర్మాణంలో పలు సవాళ్లను అధిగమించాల్సి వుంటుందని అన్నారు. 

"ఈ రోజు ఇంగ్లీష్ పలకడం కూడా చేతకాని రోజులలో తెలుగు వాళ్లకు ఇంగ్లీష్ నేర్పించే చర్య లు తీసుకున్నాను. స్పెషల్ కోచింగ్ ఇచ్చాను. స్పెషల్ క్లాసులు పెట్టించాను. ఇంజనీరింగ్ కాలేజీలు పెంచాను. హైటెక్ సిటి పెట్టాను. ఆంధ్రకే పరిమితం కావద్దు, అవకాశాల కోసం ప్రపంచమంతా వెల్లండని చెప్పాను. అమెరికా వచ్చారు. ఈ రోజు ఇంత బాగుపడ్డారు." అని ముఖ్యమంత్రి చెప్పారు.


విభజన సవాళ్లను అధిగమిస్తూ ముందుకు పోతున్నామని ఆయన అన్నారు.


రాష్ట్ర విభజనతో అనేక సమస్యలు తలెత్తాయని పేర్కొన్న ముఖ్యమంత్రి 24 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ చేయడం, పింఛన్లు ఐదు రెట్లు పెంచడం, పేదవారికి నిత్యావసరాలు అందించడం, ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, అందరికీ గ్యాస్, సీసీ రోడ్ల నిర్మాణం, ఓడీఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దడం, నదుల అనుసంధానం, కరువు రహిత రాష్ట్రంగా చేయడానికి చేపట్టిన చర్యలను వివరించారు. ప్రతి ఒక్కరు జన్మభూమితో మమేకం కావాలని ముఖ్యమంత్రి సూచించారు. 

ఆయన ఉపన్యాసంలోని కొన్ని భాగాల కోసం పై వీడియో చూడండి-