గుంటూరు: టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన విమర్శలకు మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు ఘాటు కౌంటర్ ఇచ్చారు. జగన్ గురించి తెలిసి ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డే రాష్ట్రంలో అడుగుపెడితే కాళ్లు విరగ్గొడతానని వార్నింగ్ ఇచ్చి బెంగళూరుకు పంపారంటూ అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.  

''సాయిరెడ్డిని చూస్తే జాలేస్తుంది. వందల కోట్లు పోసి పీకేతో అల్లుడు జగన్ రెడ్డికి ట్రైనింగ్ ఇప్పిస్తే లైవ్ తుస్సుమంది. ఇక చేసేది ఏమీ లేక లోకేష్ ప్రెస్ మీట్ లైవ్ లో చూసి ఊగిపోతున్నారు. లోకేష్ పెట్టిన సంతకాలకి కేంద్రం అవార్డులు పంపింది'' అంటూ ట్వీట్ చేశారు. 

''జగన్ రెడ్డి పెట్టించిన సంతకాలకి సీబీఐ,ఈడి ఛార్జ్ షీట్లు విడుదల చేసింది. వామ్మో నా కొడుకు దుర్మార్గుడు!అని రాష్ట్రంలో అడుగుపెడితే కాళ్ళు విరుస్తా అంటూ కొడుకు జగన్ రెడ్డిని,వైఎస్ బెంగుళూరు ప్యాలెస్ కి పరిమితం చేసారు.చరిత్ర దాస్తే దాగదుగా'' అంటూ సీఎం వైఎస్ జగన్ పై అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు. 

read more  తేడా వస్తే లేపేస్తా: వైసీపి నేతకు టీడీపీ నేత కూన రవి కుమార్ బెదిరింపు

అంతకుముందు ''అచ్చెన్నాయుడు ఒక సంతకంతోనే అరెస్టు అయితే.. మంత్రిగా నేను అలాంటివి రోజుకు వంద పెట్టా''.. అన్న లోకేష్ స్టేట్ మెంట్ చూసి.. చంద్రబాబు.. “ఆహా..! నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు''అని గర్విస్తాడా, లేక...'' అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. దీనిపైనే అయ్యన్న స్పందిస్తూ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. 

 ఇటీవల కూడా లోకేష్ ను టార్గెట్ గా చేసుకుని విజయసాయి రెడ్డి ట్వీట్లు చేశారు.  ''లోకేష్...!సొంత పెళ్ళానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే.. జగన్ గారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోందన్నావ్. అవునా...! తీసుకుంటున్నావా...?ఎందుకయ్యా.. రాజకీయాల్లో లేని మీ ఆవిడను కూడా నీ చేతగాని మాటలతో ఈ గొడవలోకి లాగుతావ్?!'' అంటూ లోకేష్ పై విజయసాయి సెటైర్లు విసిరారు.