Asianet News TeluguAsianet News Telugu

అంబటి అధ్యక్షుడిగా... మల్లెపూల వ్యాపారం కూడా చేయండి జగన్ రెడ్డి..: అయ్యన్న సెటైర్లు

మాంసం,చేపల వ్యాపారం చేయాలనుకుంటున్న ప్రభుత్వం ఎమ్మెల్యే అంబటి అధ్యక్షతన మల్లెపూల వ్యాపారం కూడా ప్రారంభించాలంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.

ayyannapatrudu satires on cm ys jagan and ambati rambabu
Author
Guntur, First Published Sep 17, 2021, 10:32 AM IST

విజయనగరం: మాంసం అమ్మకాలనే కాదు మల్లెపూల అమ్ముకునే వ్యాపారాన్ని సీఎం జగన్ ప్రారంభించాలని...అందుకు అంబటి రాంబాబును అధ్యక్షుడిని చేయాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. వైసిపి ప్రభుత్వ నిర్ణయాలు, సీఎం జగన్, మంత్రులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అయ్యన్న. పనికి మాలినోళ్లంతా పాలకులైతే ఆ రాష్ట్ర పరిస్థితి ఎలా వుంటుందో ఏపీని చూస్తే అర్థమవుతుందని... అసమర్ధ పాలనకు ఏపీ అద్దం పడుతోందని మండిపడ్డారు. 

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కొడెల శివప్రసాద్ రావు ద్వితీయ వర్ధంతి కార్యక్రమం గురువారం గుంటూరు జిల్లా నకరికల్లులో జరిగింది. ఈ వర్ధంతి కార్యక్రమంలో అయ్యన్న పాల్గొని కొడెలకు నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తనను ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టకోండి అంటూ సీఎం జగన్, మంత్రులను తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

లక్షల కోట్ల అప్పులు చేస్తూ రాష్ట్ర భవిష్యత్ ను అదోగతి చేస్తున్నారంటూ సీఎం జగన్ పై అయ్యన్న మండిపడ్డారు. చివరకు చెత్త, మరుగుదొడ్లపై పన్నువేయడమే కాదు మాంసం, చేపల వ్యాపారం చేసే పరిస్థితికి జగన్ సర్కార్ దిగజారిందని...  ఇక మల్లెపూల వ్యాపారం చేయడమే మిగిలిందన్నారు. వైసిపి ఎమ్మెల్యే అంబటి అధ్యక్షుడిగా ఆ వ్యాపారం కూడా ప్రారంభించాలంటూ అయ్యన్న ఎద్దేవా చేశారు. 

read more  జగన్ సర్కార్‌కు హైకోర్టు మరో షాక్: జస్టిస్ కనగరాజ్‌ నియామకం రద్దు

సన్నబియ్యం అంటే తెలియనోడు పౌరసరఫరాల శాఖ మంత్రిగా వున్నాడని మండిపడ్డారు. ఇరిగేషన్ మంత్రి అనిల్ పెద్ద బెట్టింగు రాయుడని ఆరోపించారు.లేని దిశ చట్టంతో ఉరిశిక్ష, జీవితఖైదు వేస్తామంటున్న హోం మంత్రిని చూస్తుంటే జాలేస్తోందన్నారు. హోంమంత్రికి ఏమాత్రం సిగ్గు, లజ్జ వున్నా తక్షణమే రాజీనామా చేయాలని అయ్యన్న డిమాండ్ చేశారు.  

సినిమా టికెట్లను అమ్మకాలను చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపైనా అయ్యన్న సెటైర్లు వేశారు. చివరకు బ్లాక్ టికెట్లు అమ్ముకోడానికి వైసిపి ప్రభుత్వం సిద్దమయ్యిందని అన్నారు. ఇలా తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.  

Follow Us:
Download App:
  • android
  • ios