గుంటూరు: టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడిపై ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన విమర్శలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్న విజయసాయి వ్యాఖ్యలపై స్పందిస్తూ అసలు దిగజారుడు ఇదే అంటూ కౌంటరిచ్చారు. 

''వైఎస్ఆర్ ఇళ్ల పట్టాల అమ్మకం కార్యక్రమాన్ని మూడోసారి వాయిదా వేసాడు సైకో ప్రిజనరీ. సహజీవనం అన్న మేధావి ఇప్పుడు కరోనా కారణంగా ఇళ్ల పట్టాలు అమ్మకం వాయిదా పడింది అనడం విడ్డూరంగా ఉంది. పట్టాలు అమ్మకం, డబుల్ రేటుకి స్థలాలు కొనడం. అధికార పార్టీ వాళ్లే చెత్త పాలన అంటూ వేరే కుంపటి పెడుతున్నా ప్రిజనరీ దిగజారుతూనే ఉన్నాడు'' అంటూ విజయసాయికి ట్విట్టర్ ద్వారా ఘాటుగా జవాభిచ్చారు అయ్యన్నపాత్రుడు. 

read more  ఇంకెంత దిగజారుతావు గుడ్డి విజనరీ...: చంద్రబాబుపై విజయసాయి సంచలనం

అంతకుముందు ''జగన్ గారి ప్రభుత్వం పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తుంటే నిరసనలకు పిలుపునిచ్చాడు ఒక గుడ్డి విజనరీ. హైదరాబాద్లో ఉంటూ జూమ్ యాప్ ద్వారా కుట్రలు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా బిల్లు అడ్డుకోవడం. ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లడం. ఇంకెంత దిగజారతావు బాబూ? 2024లో నీ అడ్రస్ గల్లంతే'' అంటూ విజయసాయి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు అదే ట్విట్టర్ వేదికన కౌంటరిచ్చారు అయ్యన్నపాత్రుడు.