తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. యూట్యూబ్ ఛానల్ యాంకర్‌ను కాంబాబు లైంగింకంగా వేధించారని ఆరోపించారు. ‘‘సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అంటూ కాంబాబుకి వాట్సాప్‌లో మెసేజ్ చేసింది యూట్యూబ్ ఛానల్ యాంకర్... ఇంటర్వ్యూ ఇస్తా నాకేం ఇస్తావ్ అంటూ రిప్లై ఇచ్చాడు కాంబాబు’’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.
మహిళా జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతు పురాణం సీఎంతో సహా సంబంధిత వ్యవస్థలకు చేరిందని.. ఇక త్వరలో కాంబాబు బర్తరఫ్ అవ్వడం ఖాయమని అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు.
రెండు రోజుల క్రితం మాజీ మంత్రి, టీడీపీ నేత అరెస్ట్‌కు సంబంధించి మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్‌పై అయ్యన్న పాత్రుడు తీవ్రంగా స్పందించారు. పరీక్షా ‘‘పేపర్ లీక్ చేస్తే.. అరెస్టు చేయక.. పద్మభూషణ్ బిరుదు ఇస్తారా ? అని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. దానిపై స్పందించిన అయ్యన్న పాత్రుడు.. ‘‘హస్కీ వాయిస్ తో ఆడియోలు లికైతే కాంబాబు అనకపోతే రాంబాబు అంటారా? నారాయణ గారి అరెస్ట్ కి ఆధారాలు లేవు.. నీ పరువు తక్కువ పనులకు ఆడియోలు ఉన్నాయి కాంబాబు!’’ అని ట్వీట్ చేశారు.
