దిశ ఘటన దేశవ్యాప్తంగా ప్రజలను కలిచివేసింది. వెటర్నరీ డాక్టర్ దిశ హాస్పిటల్ కి వెళ్లి వస్తుండగా... నలుగురు కిరాతకులు అత్యాచారానికి పాల్పడి అనంతరం సజీవంగా దహనం చేశారు. కాగా ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పట్ల చాలా మంది ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

మరికొందరు మాత్రం వ్యతిరేకించారు. ఈ నలుగురు నిందితులు పేదవాళ్లు కాబట్టే ఎన్ కౌంటర్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అందులో భాగంగా ఆయేషా మీరా హత్య కేసులో నిందితులను మాత్రం ఎందుకు శిక్షించలేదు అంటూ... ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో... ఆయేషా హత్య కేసులో సీబీఐ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఏపీలో 12 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసు విషయంలో  సీబీఐ కూడా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది. త్వరలోనే ఆయేషా మీరా డెడ్‌బాడీకి ‘రీ-పోస్టు మార్టమ్‌’ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సీబీఐ..లోకల్ ఆఫీసర్స్‌‌తో సంప్రదింపులు జరుపుతోంది. డిసెంబరు 20 లోగానే ‘రీ-పోస్టుమార్టమ్‌’ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నట్లు సమాచారం.

AlsoRead ప్రత్యూష, అయేషా మీరా కేసుల్లో ఏమైంది: దిశ కేసు ప్రత్యేకమా..

కొద్ది నెలల క్రితమే ఆయేషా మృతదేహానికి రీ పోస్టు మార్టమ్ చేయాలని భావించారు. అయితే... కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. తాజాగా... దీనికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 20వ తేదీదలోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సీబీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

AlsoRead Disha Case Accused Encounter: సీపీ సజ్జనార్ పై అయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు...

ఇదిలా ఉండగా... ఏపీ ప్రభుత్వం మహిళల భద్రతకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. విమెన్ సేఫ్టీ చట్టంలో విప్లవాత్మక  మార్పులు తీసుకువచ్చే చారిత్రాత్మక బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం.. మహిళలు, చిన్నారులపై అత్యాచారం, యాసిడ్ దాడుల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడేవారికి, కచ్చితమైన ఆధారాలుంటే 21 రోజుల్లోనే  ఉరి శిక్ష విధించేలా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసింది.