2019 ఎన్నికలు.. ఎంపీ అవంతి శ్రీనివాస్ సంచలన ప్రకటన

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 19, Sep 2018, 1:48 PM IST
avanthi srinivas shocking decession over coming elections
Highlights

ఇలాంటి సమయంలో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ఈ ఎన్నికల విషయంలో సంచలన ప్రకటన చేశారు.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. దీంతో ప్రతి ఒక్క నేత ఈ ఎన్నికల కోసం సిద్ధమౌతున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ఈ ఎన్నికల విషయంలో సంచలన ప్రకటన చేశారు.

రానున్న ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తానని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు( అవంతి శ్రీనివాస్) స్పష్టం చేశారు. మంగళవారం అవంతి కాలేజీలో జరిగిన సమావేశానికి హాజరైన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని చెప్పారు. జిల్లా టీడీపీలో ఎటువంటి వర్గాలు లేవని, అంతా ఏకతాటిపై నడుస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్‌, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని, లేకపోతే రాష్ట్ర ప్రజలు తమ సత్తా ఏమిటో ఎన్నికల్లో’ చూపిస్తారన్నారు.

loader