గంటా సీటుపై కన్నేసిన అవంతి: జగన్ తో బేరసారాలు

Avanthi Srinivas may join in YCP
Highlights

తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాసరావు మంత్రి గంటా శ్రీనివాస రావు సీటుపై కన్నేసినట్లు తెలుస్తోంది.

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాసరావు మంత్రి గంటా శ్రీనివాస రావు సీటుపై కన్నేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీచేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అందుకు ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీతో బేరసారాలు సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అది కూడా భీమిలి నియోజకవరం టికెట్ కావాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 2009 ఎన్నికల్లో అవంతి శ్రీనివాసరావు ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి భీమిలి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి అనకాపల్లి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు.

అయితే, భీమిలి వైసీపీ ప్రధాన కార్యదర్శి జి.వెంకటరెడ్డి ఆ నియోజకవర్గం పార్టీ వాట్సప్‌ గ్రూప్‌లో శుక్రవారం పెట్టిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసిపిలోకి రాకుండా అవంతి శ్రీనివాసరావును  అడ్డుకోవాలనే ప్రయత్నం అందులో కనిపిస్తోంది. 

loader