విశాఖపట్నం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్ని కుతంత్రాలు పన్నినా విశాఖలో పరిపాలన రాజధానిని ఆపలేరని అవంతి శ్రీనివాసరావు మరోసారి విశాఖలో స్పష్టం చేశారు. తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఉదయం బీచ్ రోడ్ లోని తెలుగుతల్లి విగ్రహానికి  మంత్రి అవంతి శ్రీనివాసరావు పులమాల వేసి అనంతరం మీడియాతో మాట్లాడారు.  

విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడం తథ్యమని మంత్రి అవంతి శ్రీనివాసరావు తేల్చిచెప్పారు  ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మనం ఎక్కడ ఉన్న కన్నా తల్లీని మర్చిపోలేమని, మాతృభాషను మర్చిపోలేమని మంత్రి శ్రీనివాసరావు అన్నారు. మాతృభాషను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. 

తెలుగు భాషకు ప్రాచీన చరిత్ర ఉందని తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగు భాషకు పెద్ద పీట వేస్తున్నరన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రెవేశపెట్టినంత మాత్రాన తెలుగును నిర్లక్ష్యం చేసినట్లు కాదని అవంతి శ్రీనివాస్ రావు అన్నారు.   

ప్రజాధనం ద్వురినియోగం అవ్వకూడదని గెస్ట్ హౌస్ ను విశాఖలో నిర్మిస్తున్నమని తెలిపారు. గెస్ట్ హౌస్ పై  కొందరు అసత్య ప్రచారాలు చేయడం తగదన్నారు.  ఎమ్మెల్యే ధర్మ శ్రీ,యార్లగడ్డ లక్ష్మిప్రసాద్, వంగపండు పద్మతో పాటు , తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

"