గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం లోని జులకళ్ళు గ్రామ నడిబొడ్డున  దారుణ ఘటన చోటుచేసుకుంది. కూలీలతో వెల్తున్న ఆటో, ట్రాక్టర్ ఒకదానికొకటి ఢీ కొట్టుకోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. 

"

జులకళ్ళు  గ్రామానికి చెందిన ట్రాక్టర్ కూలీలతో పొలాల వైపు వెళ్తున్న క్రమంలో.. నకరికల్లు మండలంలోని గుల్లపల్లి గ్రామానికి చెందిన కూలీలతో వస్తున్న ఆటో..  జులకళ్ళు  గ్రామంలో  కూలీలతో  వెళ్తున్న ట్రాక్టర్ ని బలంగా  ఢీకొట్టంది. 

దీంతో ట్రాక్టర్, ఆటో రెండూ బోల్తా పడ్డాయి.. ఘటనా స్థలంలోనే గుళ్లపల్లి గ్రామానికి చెందిన ఒక  మహిళా కూలి మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి.  పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది .

కాగా, గుళ్లపల్లి గ్రామానికి చెందిన కూలీలతో వెళ్తున్న ఆటో బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు పొలాలకి  వెళ్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.