Tirupati district: భార్య క్యారెక్టర్ పై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. ఆమెపై సిమెంట్ ఇటుకతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకుంది.
Auto driver kills second wife: భార్య క్యారెక్టర్ అనుమానం పెంచుకున్న ఓ భర్త.. ఆమెపై సిమెంట్ ఇటుకతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. రెండో భార్య తీరుపై అనుమానం పెంచుకున్న ఓ నడివయస్కుడైన ఆటోడ్రైవర్ ఆమెను సిమెంట్ ఇటుకతో కొట్టి ప్రాణాలు తీశాడు. ఆమె ను హత్య చేసిన తర్వాత నేరుగా వెళ్లి స్థానిక పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా నాగలాపురంలో బుధవారం చోటుచేసుకుంది. నిందితుడిని వెంకటేష్‌గా , బాధితురాలిని గాయత్రిగా గుర్తించారు.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగలాపురం మండలం బ్రాహ్మణ తంగల్ పంచాయతీ వద్ద వడ్డి ఇండ్లి నివాసి వెంకటేష్‌కు ఇద్దరు మహిళలతో వివాహమైంది. అతను గాయత్రి విశ్వసనీయతపై అనుమానం పెంచుకున్నాడు. అనుమానం కాస్త పెనుభూతంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం హత్య కుట్రకు ప్రాణాళికలు సిద్ధం చేసుకున్నాడు.
అనుకున్నంటుగానే మంగళవారం అర్ధరాత్రి వెంకటేష్ తన ఇద్దరు పిల్లలను మరో గదిలో ఉంచి, గాయత్రిపై సిమెంట్ ఇటుకతో దాడి చేసి ఆమె ప్రాణాలు తీశాడు. ఈ హత్య తర్వాత నిందితుడు నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న నాగలాపురం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు.
