Asianet News TeluguAsianet News Telugu

కంగారులో జగన్ కు తాకింది, అది ఫ్రూట్ సలాడ్ నైఫ్: శ్రీనివాస రావు

తనకు టీడీపీతో ఏ విధమైన సంబంధం లేదని, ఈ రోజు తాను ప్రాణాలతో ఉన్నానంటే జగనన్నే కారణమని శ్రీనివాస రావు అన్నాడు. జగన్‌ను ప్రజలు కావాలని కోరుకున్నారని, జగన్ సీఎం కావడం చాలా సంతోషంగా ఉందని జగన్‌పై దాడి కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌ అన్నాడు.

Attack on YS jagan: Srinivas version
Author
Rajahmundry, First Published May 26, 2019, 9:11 AM IST

రాజమండ్రి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై తాను కోడికత్తితో దాడి చేయలేదని, అది ఫ్రూట్‌ సలాడ్‌ కత్తి అని, తన కంగారులో ఆయనకు అప్పుడు ఏమి జరిగిందో కూడా చూడలేదని నిందితుడు శ్రీనివాస రావు అన్నాడు. జగన్‌ చాలా దయా హృదయుడని, ఆ రోజు తనను కొడుతున్నప్పుడు కూడా వాడిని కొట్టొద్దని చెప్పారని ఆయన వివరించాడు. 

తనకు టీడీపీతో ఏ విధమైన సంబంధం లేదని, ఈ రోజు తాను ప్రాణాలతో ఉన్నానంటే జగనన్నే కారణమని శ్రీనివాస రావు అన్నాడు. జగన్‌ను ప్రజలు కావాలని కోరుకున్నారని, జగన్ సీఎం కావడం చాలా సంతోషంగా ఉందని జగన్‌పై దాడి కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌ అన్నాడు.
 
శ్రీనివాసరావును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి శనివారం బెయిల్‌పై విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడాడు. తాను కుక్‌ని అని, అది కోడికత్తి కాదని, ఫ్రూట్‌ సలాడ్‌ నైఫ్‌ అని, తన జేబులో అలాంటివి రెండు ఉన్నాయని చెప్పాడు. కొన్ని సమస్యలను తీసుకుని జగన్‌ వద్దకు వెళ్లానని, కంగారులో ఆయనకు చిన్నది గీసుకుందని శ్రీనివాస రావు చెప్పాడు. 

హత్యాప్రయత్నం చేశానని, దేనికయినా లోబడ్డానని, సింపతీ కోసమని అనుకుంటే నార్కో ఎనాలసిస్‌ పరీక్షకు తాను సిద్ధమని, ఆ రోజు ఎయిర్‌పోర్ట్‌లో దొరికిన వస్తువులు చూస్తే చిన్న నైఫ్‌, ఫోర్క్‌ దొరికాయని అన్నాడు.

జగన్‌ అభిమానిని కాదంటే శిరచ్ఛేదనం చేయించుకుంటానని శ్రీనివాస్‌ అన్నాడు. కేసును రాజకీయంగా తప్పుదోవ పట్టించారని శ్రీనివాసరావు తరపు లాయర్‌ సలీం అన్నారు. కేసులో సాంకేతికపరమైన లోపాలున్నాయని చెప్పారు. జగన్‌కు శ్రీనివాసరావు వీరాభిమాని అని అతని సోదరుడు సుబ్బరాజు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios