ఓ కేసు విషయమై నిందితుల కోసం వచ్చిన కర్ణాటక పోలీసులపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దాడి జరిగింది. విషయం తెలుసుకున్న ఏపీ పోలీసులు వారిని రక్షించారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడివేళ్లలో కర్ణాటక పోలీసులపై దాడి జరిగింది. ముగ్గురు పోలీసులపై దాడి జరగ్గా.. ఓ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక పోలీసులను రక్షించి ఆసుపత్రికి తరలించారు ఎమ్మిగనూరు పోలీసులు. ఓ కేసు విషయంలో నిందితుల కోసం పోలీసులు మఫ్టీలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించి మరిన్ని వవరాలు తెలియాల్సి వుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

