ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ‌పై చెప్పుల దాడి జరిగింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నెల్లూరు జిల్లా కావలి వచ్చిన కన్నాపై కొందరు వ్యక్తులు చెప్పులతో దాడి చేశారు. వీరిని టీడీపీ కార్యకర్తలుగా భావించిన బీజేపీ నేతలు చితకబాదారు. ఈ సంఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ నేతలు కావలి పీఎస్ ముందు బైఠాయించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కన్నాఓ బహిరంగ లేఖ రాశారు.. ఆ లేఖలో ఐదు ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు.

* టీడీపీ వెబ్‌సైట్ నుంచి మీ మేనిఫెస్టోను ఎందుకు తొలగించారు..?
* మీరు చేసిన తొలి వాగ్థానాలు అమలు చేశామని చెప్పగలరా..?
* ఓటుకు నోటు కేసులో ‘‘ బ్రీఫ్డ్ మీ’’ అనే మాటలు మీవి కాదని చెప్పగలరా..?
* జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి.. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయలేదా..?
* విశాఖ సమ్మిట్ ద్వారా 2,589 ఒప్పందాలు కుదుర్చుకున్నామని.. రూ.16 లక్షల 815 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తద్వారా 36, 87,460 ఉద్యోగాలు వచ్చాయని చూపిస్తారా..?