ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీల నేతలపై ఒకరిపై మరొకరు విమర్శల దాడికి పాల్పడుతుండగా.. కార్యకర్తలు సైతం రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో గుంటూరు జనసేన కార్యాలయంలపై దాడి చేశారు.

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో నిర్మించిన జనసేన కార్యాలయాన్ని జనవరిలో పవన్ కళ్యాణ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కార్యాలయంపై తాజాగా గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బీరు బాటిళ్లు విసిరి అద్దాలు పగలకొట్టారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యురిటీ మీద కూడా దాడి చేసినట్లు సమాచారం. 

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆఫీసు వద్ద ఉన్న సీసీ కెమేరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.జనసేన పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఇతర పార్టీ నేతలు ఈ దాడికి పాల్పడ్డారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.