ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ కేంద్రంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. గురువారం అర్థరాత్రి కార్యాలయం వద్దకు చేరుకున్న కొందరు వ్యక్తులు అక్కడున్న వాహనాలను ధ్వసం చేయడమే కాకుండా  భారీగా ఏర్పాటుచేసిన పెక్సీలను కూడా చించివేశారు. దీంతో దర్శిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 

దర్శి వైసీపి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కు వ్యతిరేకంగా అదే పార్టీలో మరో వర్గం వుందని... ఇటీవల కాలంలో ఇరువర్గాల మధ్య  పలు విషయాల్లో విభేదాలు తలెత్తినట్లు స్థానికులు చెబుతున్నారు.  ఈ క్రమంలో గురువారం ఎమ్మెల్యే సోదరుడి జన్మదినం సందర్భంగా కార్యాలయం వద్ద భారీగా ప్లెక్సీలు ఏర్పాటుచేశారు. దీంతో ప్రత్యర్ధి వర్గం ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడి వుంటారని అనుమానిస్తున్నారు. 

 read more  ఎన్టీఆర్ విగ్రహ వివాదం... బాలయ్యకు వైసీపీ ఎమ్మెల్యే ఫోన్

కార్యాలయ ఆవరణలోకి ప్రవేశించి హల్ చల్ చేసిన దుండగులు.. కార్యాలయ తాళాలు పగులగొట్టి లోపలకు వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. అది కుదరకపోవడంతో బయట వున్న వాహనాలు, ప్లెక్సీలను ద్వంసం చేసి వెళ్లిపోయారు.