Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ విగ్రహ వివాదం... బాలయ్యకు వైసీపీ ఎమ్మెల్యే ఫోన్

విగ్రహం పెట్టి తీరాల్సిందేనని.. విగ్రహం ఏర్పాటు చేసేంతవరకూ వెనక్కి తగ్గొద్దని బాలయ్య కూడా పట్టుబట్టి స్థానిక నేతలకు నిత్యం టచ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో కావలి వైసీపీ ఎమ్మెల్యే.. బాలయ్యకు ఫోన్ చేశారు.
 

YCP MLA  Rami Reddy Pratap Kumar Phone call conversation to BalaKrishna over NTR Statue issue
Author
Hyderabad, First Published Jul 24, 2020, 8:11 AM IST

నెల్లూరు జిల్లా కావలిలో  ఇటీవల సినీ నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు కావాలనే ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించారంటూ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఇప్పటికే చంద్రబాబు, బాలకృష్ణలు స్పందించారు. 

ఎన్టీఆర్ విగ్రహం టచ్ చేయాలన్నా వైసీపీ నేతలు భయపడేలా చేయాలంటూ చంద్రబాబు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇక బాలకృష్ణ సైతం స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం పెట్టి తీరాల్సిందేనని.. విగ్రహం ఏర్పాటు చేసేంతవరకూ వెనక్కి తగ్గొద్దని బాలయ్య కూడా పట్టుబట్టి స్థానిక నేతలకు నిత్యం టచ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో కావలి వైసీపీ ఎమ్మెల్యే.. బాలయ్యకు ఫోన్ చేశారు.

గురువారం మధ్యాహ్నం స్వయంగా ఫోన్ చేసిన ఎమ్మెల్యే.. విగ్రహం వివాదంపై బాలయ్యతో నిశితంగా చర్చించారు. అసలు విగ్రహంపై వివాదం ఎందుకు రాజుకుంది..? స్థానికులు ఆ విగ్రహాన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది..? అనే విషయాలను బాలయ్యకు వివరించారు. 

ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం వీపు భాగం ఆలయం ఎదురుగా ఉన్నందునే స్థానికులు తొలగించారని బాలయ్యకు ఎమ్మెల్యే చెప్పారు. అంతేకాదు.. వివాదాస్పదం కాని స్థలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తామని కూడా బాలయ్యకు స్థానిక ఎమ్మెల్యే ఇచ్చారు. 

ఈ సందర్భంగా.. తాను కూడా ఎన్టీఆర్ వీరాభిమానిని అని ఆయనకు రామిరెడ్డి చెప్పారు. ఇందుకు బాలయ్య కూడా సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది. కాగా.. వైసీపీ ఎమ్మెల్యే ఒక్క ఫోన్ కాల్ తో.. సమస్యను సామారస్యంగా పరిష్కరించినట్లు స్పష్టంగా అర్థమౌతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios