వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే నిమ్మగడ్డకు ఆ పదవి...: అచ్చెన్నాయుడు

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నపుడే  నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కీలక శాఖను అప్పగించారని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. 

Atchennaidu Reacts YSRCP Allegations on  EC NimmagaddaRamesh Kumar

గుంటూరు: ముఖ్యమంత్రి స్ధాయిలో ఉన్న వ్యక్తి కులాల గురించి మాట్లాడటమేంటని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈసీపై జగన్‌  చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చేలా ఉన్నాయన్నారు. 

ప్రస్తుత రాష్ట్ర  ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆర్ధిక శాఖ ప్రధాన కార్యదర్శి వంటి కీలక స్థానంలో పనిచేశారని గుర్తుచేశారు. ఆ  విషయాన్ని కూడా మర్చిపోయి జగన్ ఆయనకు కులాన్ని అంటగట్టి మాట్లాడటం బాధాకరమన్నారు.

ఎన్నికలు వాయిదా పడటం వల్ల రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రూ.5 వేల కోట్లు రాకుండా చంద్రబాబు అడ్డకున్నారని వైసీపీ నేతలు పదే పదే మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. కానీ ఎన్నికలకు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధ లేదని... ఎన్నికలయ్యాక కూడా కేంధ్రం నిధులు ఇస్తుందని ఎన్నికల ప్రధాన అధికారి రమేష్ కుమార్ స్పష్టం చేశారని తెలిపారు. దీనికి వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారు? అని  ప్రశ్నించారు.

read more   ఇక ఎన్నికలెందుకు... నామినేట్ చేసుకుంటే సరి: జగన్ సర్కార్ కు నిమ్మకాయల చురకలు

దేశంలో అందరూ కరోనా వైరస్ గురించి మాట్లాడుతుంటే... జగన్ ఒక్కడే ఎన్నిలక గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ  ఎన్నికల్లో దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడి ఏకగ్రీవాలు చేసుకోవడమే కాకుండా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అధిక స్ధానాలు  ఏకగ్రీవం అవుతాయంటూ  మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. 

9 నెలల్లోనే ప్రజలకు ఏం ఒరగబెట్టారని ప్రజలు వైసిపి అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తారో ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. సీఎం జగన్ ఇప్పటికైనా కరోనాపై శ్రద్ద పెట్టాలని అచ్చెన్నాయుడు సూచించారు. 

read more   ఏపి పోలీస్ డిపార్ట్ మెంట్ లో కరోనా కలవరం... కానిస్టేబుల్ కొడుకుకు లక్షణాలు

ఏపికి దాదాపు 6,700 మంది విదేశాల నుంచి వచ్చారని, వారు  ఏ జిల్లాల్లో ఉన్నారు, వారికి  కరోనా టెస్టులు చేశారా? అన్న ప్రశ్నలకు  ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా జగన్‌ తన వ్యవహారశైలిని మార్చుకొని కరోనా నివారణపై శ్రద్ద పెట్టాలని అచ్చెన్నాయుడు కోరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios