చంద్రబాబుకు ప్రధాని అపాయిట్మెంట్ దొరికిందోచ్

చంద్రబాబుకు ప్రధాని అపాయిట్మెంట్ దొరికిందోచ్

మొత్తానికి చంద్రబాబునాయుడుకు ప్రధానమంత్రి నరేంద్రమోడి అపాయిట్మెంట్ దొరికింది. ఈనెల 12వ తేదీ ఉదయం చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి నరేంద్రమోడితో భేటీ అవుతున్నారు. అపాయిట్మెంట్ గురించి ప్రధాని కార్యాలయం టిడిపి ఎంపిలకు సమాచారం ఇచ్చిందట. ఓ సిఎంకు ప్రధాని అపాయిట్మెంట్ ఇవ్వటమన్నది మామూలు విషయమే. కానీ చంద్రబాబు విషయంలోనే అద్భుతమైంది.

ఎందుకంటే, గడచిన ఏడాదిన్నరగా ప్రధాని అపాయిట్మెంట్ కోసం చంద్రబాబు ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అదే సమయంలో ప్రతిపక్ష వైసిపి నేతలు మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రధానిని కలవగలుగుతున్నారు. ముఖ్యమంత్రిని కాదని ప్రతిపక్ష నేతలను ప్రధాని కలవటమంటే చంద్రబాబుకు అంతకుమించిన అవమానం ఇంకేముంటింది. ఒకసారి కాదు రెండు సార్లు కాదు చాలా సార్లే జరిగింది.

ప్రధాని అపాయిట్మెంట్ సంపాదించటం తన వల్ల కాక చివరకు చంద్రబాబు కేంద్రమంత్రులను, ఎంపిలను రంగంలోకి దింపారు. ఎటూ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కదా? అందుకనే కేంద్రమంత్రి, ఎంపిలకు ప్రధాని అపాయిట్మెంట్ ఈజీగానే దొరికింది. దాంతో చంద్రబాబు విషయంలో ప్రధానిపై ఒత్తిడే పెట్టారో లేక బ్రతిమలాడుకున్నారో తెలీదు. మొత్తానికి ప్రధానితో భేటీలో చంద్రబాబుకు అపాయిట్మెంట్ సాధించగలిగారు.

12వ తేదీ బేటీలో ఇద్దరి మధ్య చర్చకు రాబోయే అంశాలపై పెద్ద ప్రచారమే మొదలైంది. పోలవరం, రాజధానికి నిధులు, ప్రత్యేక సాయంకు చట్టబద్దత, లోటు బడ్జెట్ భర్తీ..ఇలా చాలా అంశాలే ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రస్తావించటానికి ప్రధాని ఏ మేరకు చంద్రబాబుకు అవకాశం ఇస్తారో చూడాల్సిందే.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page