ఏపీ ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తారని ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం అశోక్ బాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం  చేశారు. ఆయన చేత మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ..రాష్ట్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈవీఎంలపై టీడీపీ ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినందుకు ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుకి దన్యవాదాలు తెలిపారు.

60ఏళ్ల తర్వాత ఉద్యోగ సంఘాల నుంచి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిందని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తారన్నారు. సీపీఎస్ విధానం రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అశోక్ బాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎంపీ కనకమేడల, మండలి బుద్ధ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.