విజయనగరం రామతీర్థం కొండపై ఉద్రిక్తత.. ఆందోళ‌న‌కు దిగిన అశోక్ గ‌జ‌ప‌తిరాజు

విజయనగరం (Vizianagram) జిల్లాలోని రామతీర్థంలోని బోడికొండపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. బోడికొండపై కోదండ రాముని ఆలయ (Ramatheertham temple) పునర్నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగనుంది. ఆలయ పునర్మిరాణ శంకుస్థాపనను ధర్మకర్తల మండలితో చర్చించకపోవడంపై ఆలయ ధర్మకర్త, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్‌గజపతి రాజు (Ashok Gajapathi Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

ashok gajapathi raju Protest against Govt over ramatheertham temple renovation

విజయనగరం (Vizianagram) జిల్లాలోని రామతీర్థంలోని బోడికొండపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. బోడికొండపై కోదండ రాముని ఆలయ (Ramatheertham temple) పునర్నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగనుంది. ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొననున్నారు. అయితే తేడాది డిసెంబర్ 28వ తేదీన రాత్రి సమయంలో కోదండ రామస్వామివారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం (vandalise idol in Ramatheertham temple) చేశారు. . శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకుపోయారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 

అయితే ఆలయ పునర్మిరాణ శంకుస్థాపనను ధర్మకర్తల మండలితో చర్చించకపోవడంపై ఆలయ ధర్మకర్త, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్‌గజపతి రాజు (Ashok Gajapathi Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడికొండపై శంకుస్థాపన జరుగుతున్న చోట ఆందోళకు దిగారు. పునర్నిర్మాణ, శంకుస్థాపన ఫలకాలు ప్రభుత్వం తరఫున ఏర్పాటుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలఫలకాలను తోసేశారు. ఈ క్రమంలోనే అధికారులు, అశోక్‌గజపతిరాజుకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. 

ఆలయంలో స్వామివారి విగ్రహాం ధ్వంసం జరిగి ఏడాది అవుతున్నా ఇంతవరకు నిందితులను పట్టుకోలేదని అశోక్ గజపతి రాజు అన్నారు. ఏడాదిలో గుడి కట్టి తీరుతం అని చెప్పి ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా జరగక పోవడం దారుణమ‌ని అన్నారు. ఆధారాలను తారుమారు చేయడానికి ఇంత ఆలస్యం చేశారని ఆరోపించారు. ఆలయ ధర్మకర్తకు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటనకు సంబంధించి తమపై నిందలు కూడా వేశారని అన్నారు. ఆలయానికి విరాళం ఇస్తే తిరిగి తన మొహం మీద కొట్టారని.. భక్తులు ఇచ్చే విరాళాలను తిరిస్కరించే అధికారం మీకెక్కడిది అని ప్రభుత్వాన్ని నిలదీశారు.  ఈ ప్రభుత్వం హయాంలో వందలాది ఆలయాలు ధ్వంసం జరిగాయని మండిపడ్డారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios