జగన్ పై విరుచుపడ్డ ముఖ్యమంత్రి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని అడ్డుకుంటున్నారని ఆరోపణ. జగన్ వ్యాఖ్యలు అభ్యంతరకరం.

వైసీపి నంద్యాల ఎన్నిక‌లతో గంల్ల‌తవ్వ‌డం ఖాయం అని జ్యోష్యం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. ప్రజలకు మంచి చేస్తున్న తనను నడిరోడ్డుపై కాల్చేయాలంటున్నాడు.. ఉరివేయాలంటున్నాడు.. బట్టలూడదీస్తా అంటున్నాడు.. ఇదెక్కడి పద్దతి.. ఇవేం మాటలు.. విపక్ష నేత మాట‌లేనా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 12 రోజుల నుంచి ఇక్కడే తిష్ట వేశాడని... అంత అవసరం ఏముందని ఆయ‌న‌ ప్రశ్నించారు. నంద్యాల ప్ర‌చారంలో పాల్గొన్న బాబు జ‌గ‌న్ పై విరుచుకుప‌డ్డారు. 


విపక్ష నేత జగన్.. ప్రజల కోసం ఏదేదో చేస్తున్నట్లు నటిస్తున్నారని సీఎం విమర్శించారు. లా పుస్తకాల్లో ఇటీవల క్విడ్‌ప్రోకో అనే అంశాన్ని చేర్చారని, అందులో జగన్, గాలి జనార్థన్ రెడ్డిల క్విడ్ ప్రోకో‌ను కేస్ స్డడీగా పెట్టారన్నారు. జ‌గ‌న్ అమ‌రావతి రావడానికి జగన్‌కు సమయం లేదుగాని.. నంద్యాలలో మాత్రం 12 రోజులుగా జగన్‌ తిష్ట వేశారని విమర్శించారు. జగన్‌ను చూసి తాను భయపడుతున్నానని అనడం... గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించినట్లుందని ఎద్దేవా చేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శోభానాగిరెడ్డి చనిపోయినప్పుడు ఆళ్లగడ్డలో తాము పోటీ చేయలేదన్నారు.

 వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి.. శిల్పా మోహన్ రెడ్డిపైనా సీఎం విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదన్నారు. పైగా మార్కెట్ భూములు, పేద ప్రజల భూములు కాజేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆయనను గెలిపిస్తే.. ప్రజలకు నష్టమే ఎక్కువ అని అన్నారు.