ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే కల్యాణోత్సవానికి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
కడప జిల్లాలోని ఒంటిమిట్ట దేవాలయంలో సీతారాముల కల్యాణానికి బుధవారం ధ్వజారోహణం జరిగింది. ఉదయం 9.18 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 10వ తేదీన స్వామివారి కల్యాణం జరుగుతుంది. కార్యక్రమ ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్ధానం స్వయంగా పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే కల్యాణోత్సవానికి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్రం నలుమూలల నుండి భక్తుల రాకపోకలకు ప్రభుత్వం అవసరమైన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసింది.
