వారిపై చంద్రబాబు ఒక్కసారి కన్నెర్రచేస్తే అంతే సంగతులు. పైగా ఇప్పటికిప్పుడు రాజీనామాలు చేసి ఏం సాధిస్తారు? ఏ పార్టీలోకి వెళతారు?

ప్రతిసారి ఉండేదే ఇపుడూ జరుగుతోంది. మంత్రివర్గంలో చోటు దక్కలేదని, ఎన్నికల్లో టిక్కెట్లు రాలేదని నిరసనతో పార్టీకి రాజీనామా చేస్తాననటం, అధినేత తరపున బుజ్జగింపుల కోసం ఎవరో రంగంలోకి దిగటం ఇదంతా ఎక్కడైనా జరిగేదే. ఇపుడు కూడా అదే సీన్ రిపీట్ అవతోంది. తాజాగా మంత్రివర్గ ప్రక్షాళన సందర్భంగా టిడిపిలోని అసంతృప్తులు ఒక్క సారిగా బయటపడ్డాయి. మంత్రివర్గం నుండి తప్పించినందుకు నిరసనగా బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మొదట ఎంఎల్ఏగా రాజీనామా చేసారు.

అదే వరసలో మరికొందరు ఎంఎల్ఏలు కూడా నడుస్తున్నారు. అయితే, వారంతా రాజీనామాల విషయంలో ఎంత సీరియస్ గా ఉన్నారో ఒకటి రెండు రోజుల్లో తెలిసిపోతుంది. ఎందుకంటే, ఇపుడు రాజీనామాలంటున్న వారిలో ఏ ఒకరిద్దరు మినహా మిగిలిన వారి అధికారం లేకుండా బ్రతకలేరు. ఇప్పటికైతే దూళిపాళ నరేంద్ర, చింతమనేని ప్రభాకర్, బోండా ఉమ, శ్యాం సుదర్ శివాజి తదితరుల పేర్లు వినబడుతున్నాయ్. కాకపోతే చాలామంది సీనియర్లకు అన్యాయం జరిగిన మాట మాత్రం వాస్తవం. పరిమిత సంఖ్యలో మంత్రిపదువులన్నపుడు ఎవరైనా చేయగలిగేది కూడా ఏమీ ఉండదు.

మిగిలిన వాళ్ళల్లో బోండా, చింతమనేని లాంటి వాళ్ళది కేవలం తాటాకు చప్పుళ్ళేనని పార్టీ వర్గాలే అంటున్నాయ్. ఎందుకంటే, వారు అధికారంలో లేకపోతే బ్రతకలేరు. వారిపై చంద్రబాబు ఒక్కసారి కన్నెర్రచేస్తే అంతే సంగతులు. పైగా ఇప్పటికిప్పుడు రాజీనామాలు చేసి ఏం సాధిస్తారు? ఏ పార్టీలోకి వెళతారు? ఆ విషయం అందరికీ తెలుసు. అందుకే రాజీనామాలను పార్టీ నేతలందరూ డ్రామాలుగా కొట్టిపారేస్తున్నారు. ఆది నారాయణ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటే పార్టలో ఉండనని ఎప్పటి నుండో చెబుతున్న రామసుబ్బారెడ్డి ఒక్కరే సీరియస్ గా ఉన్నట్లు కనబడుతున్నారు.