350 ఎలక్ట్రిక్ బస్సులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అద్దె ప్రాతిపదికన టెండర్లను ఆహ్వానించింది. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్దతిన 12 ఏళ్ల కాలపరిమితికి ఎలక్ట్రికల్ బస్సులకు టెండర్లను పిలిచింది. రన్నింగ్ కిలోమీటర్లకు చెల్లింపులు చేసేలా టెండర్లను పిలిచారు.

అక్టోబర్ 14న టెక్నికల్ బిడ్‌లు, నవంబర్ 1న ఫైనాన్షియల్ బిడ్లు, నవంబర్ 6న రివర్స్  బిడ్డింగ్‌కు ఏపీఎస్ఆర్టీసీ వెళ్లనుంది. దీనిలో భాగంగా గురువారం ప్రి బిడ్ సమావేశం నిర్వహిస్తోంది.

రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతికి ఎలక్ట్రికల్ బస్సులు నడపనున్నారు. ఏడాదిలోగా వీటిని రోడ్ల మీదకు తెచ్చేలా సర్కార్ కసరత్తులు చేస్తోంది. 

టెండర్లకు ఆహ్వానించిన రూట్లు:
* కాకినాడ-రాజమండ్రి-అమలాపురం
* గన్నవరం-హనుమాన్ జంక్షన్
* విజయవాడ-గుడివాడ-భీమవరం
* జగ్గయ్యపేట-మచిలీపట్నం
* నూజివీడు-కోదాడ
* విజయవాడ-అమరావతి
* విజయవాడ-గుంటూరు
* విశాఖ-యలమంచిలి-భీమిలి-శ్రీకాకుళం-నర్సీపట్నం
* తిరుపతి-తిరుమల ఘాట్