Asianet News TeluguAsianet News Telugu

ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. సాధారణ ఛార్జీలతో సంక్రాంతికి 1000 ప్రత్యేక బస్సులు..

ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. సంక్రాంతి పండుగ కోసం వెయ్యి ప్రత్యేక బస్సులను నడపనుంది. అయితే ఈ బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేయనుంది. 

APSRTC runs Special buses for Sankranti
Author
First Published Dec 15, 2022, 8:04 AM IST

అమరావతి : పెద్ద పండుగ అయిన సంక్రాంతికి తమ కుటుంబంతో.. బంధుమిత్రులతో.. తమ సొంతూళ్లో సంతోషంగా గడపాలనుకుంటారు. రోజువారీ హడావుడీ, చికాకుల నుంచి దూరంగా నాలుగైదు రోజులు రిలాక్స్ అవ్వాలనుకుంటారు. అందుకే సంక్రాంతి వచ్చిందంటే చాలు.. బస్సులు, ట్రైన్ లకు రద్దీ పెరిగిపోతుంది. టికెట్లు దొరకక.. చివరి నిమిషం వరకు టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది. దీనికితోడు పండుగ అవసరాన్ని క్యాష్ చేసుకోవడానికి ధరలు పెంచి.. జేబుకు చిల్లులు పెడుతుంటారు. అయితే దీనికి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చెక్ పెట్టనుంది.

ఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. జనవరి 6 నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. అయితే, ఈ ప్రత్యేక బస్సుల్లోనూ మామూలు చార్జీలే వసూలు చేయాలని నిర్ణయించింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాలకు కూడా సర్వీసులు నడపనుంది. దీనికోసమే విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు 1000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ప్రయాణికులు.. టికెట్లను.. ఆర్టీసీ వెబ్సైట్, టికెట్ బుకింగ్ కేంద్రాల్లో ప్రత్యేక బస్సుల రిజర్వేషన్ సదుపాయం కల్పించింది.

ఇదిలా ఉండగా, తెలంగాణ ఆర్టీసీ కూడా ఇదివరకు ప్రత్యేక బస్సులను ప్రకటించింది. సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. ఇక్కడ ఉద్యోగాలు చేసేవారు పండుగ వేళ నాలుగైదు రోజులు సెలవులు పెట్టుుని మరీ తమ స్వగ్రామాలకు.. వెడుతుంటారు. దీనికి తోడు స్కూల్స్ సెలవులు ఉండడం మరింత కలిసి వస్తుంది. దీంతో ఒక్కసారిగా నగరం ఖాళీ అవుతుంది. అయితే.. సంక్రాంతికి సొంత ఊరుకు ముఖ్యంగా ఆంధ్రాకు వెళ్లేవారు ట్రైన్ రిజర్వేజన్లు, తత్కాల్ టికెట్లు, బస్సుల రద్దీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. దీన్నినివారించడానికి టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. 

సంక్రాంతి ప్రయాణికుల కోసం ప్రయాణికులకు 4,233 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 7 నుంచి 15 వరకు అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు 60 రోజుల ముందుగానే రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ఈ ప్రత్యేక బస్సులు అమలాపురం, విశాఖ సహా పలు ప్రాంతాలకు,  తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ట్రిప్పులు వేయనున్నాయి.

ఏపీ రాజకీయాల్లో కలకలం : కన్నా లక్ష్మీనారాయణతో నాదెండ్ల మనోహర్ భేటీ... ఏం జరుగుతోంది..?

సంక్రాంతి పండుగ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగ రద్దీ వేళ ప్రయాణికుల తిప్పలు తగ్గించేందుకు ఏకంగా 4,233 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నిరుడు 3,736 బస్సులు ఏర్పాటు చేయగా, ఈసారి పది శాతం అదనంగా బస్సులు ఏర్పాటు చేయడం గమనార్హం. అంతేకాదు, వీటిలో 585 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుండగా, 60 రోజుల ముందుగానే రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. 

గతంలో ఈ రిజర్వేషన్ సదుపాయం నెల రోజుల ముందు మాత్రమే ఉండేది. వచ్చే ఏడాది జూన్ నెలాఖరు వరకు రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో 125 అమలాపురానికి, 117 బస్సులు కాకినాడకు, 83 బస్సులు కందుకూరుకు, 65 విశాఖపట్టణానికి, 51 పోలవరానికి, 40 రాజమహేంద్రవరానికి నడుపుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే, తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు కూడా ప్రత్యేక బస్సులు నడుస్తాయని సజ్జనార్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios