Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో లాక్‌డౌన్: ఏపీ నుండి కర్ణాటకకు బస్సులు బంద్

కర్ణాటక రాష్ట్రంలో లాక్‌డౌన్  విధించడంతో  ఏపీ నుండి  కర్ణాటక వెళ్లే బస్సులు నిలిచిపోయాయి. రెండు వారాల పాటు కర్ణాటకలో  లాక్ డౌన్ విధిస్తూ ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకొంది. ఇవాళ్టి నుండి కర్ణాటకలో 14 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీంతో కర్ణాటక రాష్ట్రానికి వెళ్లే బస్సును ఏపీఎస్ఆర్టీసీ నిలిపివేసింది. 

APSRTC cancels RTC Buses to Karnataka lns
Author
Amaravati, First Published Apr 27, 2021, 11:00 AM IST

అమరావతి: కర్ణాటక రాష్ట్రంలో లాక్‌డౌన్  విధించడంతో  ఏపీ నుండి  కర్ణాటక వెళ్లే బస్సులు నిలిచిపోయాయి. రెండు వారాల పాటు కర్ణాటకలో  లాక్ డౌన్ విధిస్తూ ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకొంది. ఇవాళ్టి నుండి కర్ణాటకలో 14 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. దీంతో కర్ణాటక రాష్ట్రానికి వెళ్లే బస్సును ఏపీఎస్ఆర్టీసీ నిలిపివేసింది. 

also read@కరోనా ఎఫెక్ట్: ఏప్రిల్ 27 నుండి కర్ణాటకలో‌ లాక్‌డౌన్

గత ఏడాది కూడ  కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంలో కూడ  ఏపీఎస్ఆర్టీసీ కర్ణాటకకు ఆర్టీసీ బస్సులను నిలిపివేసింది. గత ఏడాది జూన్ 17వ తేదీన కర్ణాటకకు ఏపీ బస్సులు పున:ప్రారంభమయ్యాయి. 84 రోజుల తర్వాత ఏపీ నుండి కర్ణాటకకు బస్సులు ప్రారంభమయ్యాయి.ఏపీ నుండి కర్ణాటకకు సుమారు 58కి పైగా బస్సులు నడుస్తాయి. అయితే  కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో కర్ణాటకకు వెళ్లే బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అనంతపురం, కర్నూల్ జిల్లాల నుండి పెద్ద ఎత్తున బస్సులు  కర్ణాటకకు వెళ్తాయి. కర్ణాటకలో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చివరి అస్త్రంగా లాక్‌డౌన్ ను ప్రకటించింది. 

దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్న రాష్ట్రాల్లో కర్ణాటక రాష్ట్రం కూడ ఒకటి. ఆదివారం నాడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కర్ణాటక సీఎం యడియూరప్ప కేబినెట్ సమావేశం నిర్వహించి కర్ణాటకలో లాక్ డౌన్ పై నిర్ణయాన్ని ప్రకటించారు. కొన్ని గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకుల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios