Asianet News TeluguAsianet News Telugu

శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ బస్సును తీసుకెళ్లిన దుండగులు: పోలీసుల గాలింపు

శ్రీకాకుళం జిల్లాలోని వంగరలో నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే బస్సును మీసాలడోలపేట గ్రామం వద్ద వదిలివెళ్లారు. బస్సును ఎవరు తీసుకువెళ్లారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 

APSRTC bus goes missing from At Vangara Village in Srikakulam District
Author
Guntur, First Published Aug 9, 2022, 10:25 AM IST

శ్రీకాకుళం: Srikakulam జిల్లాలోని Vangara లో నైట్ హాల్ట్ RTC బస్సును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ విషయమై ఆర్టీసీ డ్రైవర్ పోలీసులకు పిర్యాదు చేశారు.  పోలీసులు ఆర్టీసీ బస్సు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అదే సమయంలో రేగిడి మండలం మీసాలడోలపేట సమీపంలో బస్సును వదిలివెళ్లారు.ఈ బస్సును ఎవరు తీసుకెళ్లారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

శ్రీకాకుళం జిల్లాలో వంగర వద్ద నైట్ హాల్ట్ బస్సును డ్రైవర్ పార్క్ చేశాడు. ప్రతి రోజూ ఎక్కడ బస్సును పార్క్ చేస్తారో అక్కడే బస్సును పార్క్ చేశాడు. ఇవాళ ఉదయం డ్రైవర్ వచ్చి చూసేసరికి బస్సు లేదు. దీంతో ఆందోళన చెందిన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  ఈ విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులకు కూడ డ్రైవర్ సమాచారం ఇచ్చాడు.  డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు  ఆర్టీసీ బస్సు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వంగరతో పాటు ఈ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే మీసాలడోలపేట గ్రామం వద్ద బస్సు ను దుండగులు వదిలివెళ్లారు. ఈ విషయమై  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

గతంలో ఈ తరహా ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకొన్నాయి. 2019  ఏప్రిల్ 25న తెలంగాణలో ని  సీబీఎస్ లో పార్క్ చేసిన బస్సు మాయమైంది. నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సును సీబీఎస్ లో  డ్రైవర్ పార్క్ చేశాడు. ఉదయం వచ్చి చూసేసరికి బస్సు మాయమైంది. ఈ విషయమై డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు మహారాష్ట్రలోని నాందేడ్ లోని ఓ షెడ్ లో ఈ బస్సును పోలీసులు గుర్తించారు.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios