Asianet News TeluguAsianet News Telugu

ప్రారంభించిన మూడు రోజులకే: కనకదుర్గ ఫ్లైఓవర్ నుండి పెచ్చులూడి కానిస్టేబుల్‌కి గాయాలు

విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పెచ్చులూడి పడి కానిస్టేబుల్ గాయపడ్డాడు. కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. అతడికి ప్రాథమిక చికిత్స చేయించారు. ఫ్లైఓవర్ ప్రారంభించిన రెండు రోజులకే సిమెంట్ పెచ్చులూడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

APSP constable Rambabu injured after kanaka durga flyover concrete fell down on him lns
Author
Amaravathi, First Published Oct 19, 2020, 4:51 PM IST

విజయవాడ: విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పెచ్చులూడి పడి కానిస్టేబుల్ గాయపడ్డాడు. కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. అతడికి ప్రాథమిక చికిత్స చేయించారు. ఫ్లైఓవర్ ప్రారంభించిన రెండు రోజులకే సిమెంట్ పెచ్చులూడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

also read:ఏపీ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం: విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్‌ ప్రారంభించిన గడ్కరీ

 

APSP constable Rambabu injured after kanaka durga flyover concrete fell down on him lns

కనకదుర్గ ఫ్లైఓవర్ ఆశోక్ పిల్లర్ సమీపంలో పెచ్చులూడి పడడంతో  అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎపీఎస్పీ కానిస్టేబుల్ రాంబాబుకు గాయలయ్యాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఎపీఎస్పీకి చెందిన కానిస్టేబుల్ రాంబాబు ఆశోక్ పిల్లర్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు.  రాంబాబు చేతికి, భుజానికి గాయాలయ్యాయి. వెంటనే ఆయనకు ప్రాథమికి చికిత్స చేయించారు.

APSP constable Rambabu injured after kanaka durga flyover concrete fell down on him lns

ఈ నెల 16వ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. రెండు సార్లు ప్రారంభోత్సవం వాయిదా పడిన తర్వాత మూడోసారి ఫ్లైఓవర్ ను ప్రారంభించారు.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios