Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీకి వేల కోట్ల అప్పు ఉంది, సమ్మెపై చర్చిస్తున్నాం: ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు

మెుత్తానికి ఆర్టీసీకి రూ6,000 కోట్లు వస్తుంటే రూ.6800 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. అయినప్పటికీ తాము ఆర్టీసీ నష్టాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది రూ.1200 కోట్లు నష్టం వస్తే ఈ ఏడాది రూ.1000 కోట్లకు తగ్గించామని తెలిపారు.   

aps rtc md surendrababu pressmeet
Author
Vijayawada, First Published May 10, 2019, 1:28 PM IST


విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉందని ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు స్పష్టం చేశారు. డీజిల్ రేట్లు పెరగడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. 

ఆర్టీసీ యూనియన్ నేతలు సమ్మె నోటీస్ ఇచ్చారని వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఆర్టీసీ మెుత్తం రూ.3వేల కోట్లు నష్టాల్లో ఉందని, రూ.2వేల కోట్లు బ్యాంక్ అప్పులు ఉన్నాయని తెలిపారు. 

ప్రతీ కిలోమీటర్ల కు ఆరున్నర రూపాయలు నష్టం వస్తుందని తెలిపారు. ఉద్యోగుల పీఎఫ్ డబ్బులు వాడుకున్నా వాటిని తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని తెలిపారు. ఆర్టీసీ నష్టాలకు ఉద్యోగులు, కార్మికులు కారణం కాదన్నారు. 

త్వరలోనే వెయ్యి బస్సులు నడపాల్సిన పరిస్థితి ఉందని కానీ ప్రస్తుతం కొనలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. మెుత్తానికి ఆర్టీసీకి రూ6,000 కోట్లు వస్తుంటే రూ.6800 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. అయినప్పటికీ తాము ఆర్టీసీ నష్టాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది రూ.1200 కోట్లు నష్టం వస్తే ఈ ఏడాది రూ.1000 కోట్లకు తగ్గించామని తెలిపారు.   

డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీపై తీవ్ర భారం పడుతోందని స్పష్టం చేశారు. 2014-15లో డీజీల్ ధర రూ.1426 కోట్లు ఖర్చు అయితే అది ఈ ఏడాది రూ. 2,074 కోట్లకు చేరిందన్నారు. అంటే దాదాపుగా రూ. 650 కోట్లు ఆర్టీసీ యాజమాన్యం భరిస్తోందని స్పష్టం చేశారు. నాలుగేళ్లలో 8 శాతం మాత్రమే ఆర్టీసీకి వచ్చే ఆదాయాన్ని పెంచగలిగామని తెలిపారు.   

ఇకపోతే ఖర్చులు ప్రతీ ఏడాది పెరుగుతూనే ఉన్నాయని తెలిపారు. 2015-16 సంవత్సరానికి రూ.735 కోట్లు, 2016-17 సంవత్సరంలో రూ.789 కోట్లు అలాగే 2017-18లో నష్టాలు రూ.1205 కోట్లు అని చెప్పుకొచ్చారు. 

పీఆర్సీ భారం వల్ల రూ.750 కోట్లు పెరిగిందని అందువల్లే రూ.1205 కోట్లు ఖర్చులు పెరిగాయన్నారు. ఇకపోతే ఈ ఏడాది డీజిల్ రేట్లు పెరగడం, పీఆర్సీ ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల రూ.1029 కోట్లకు తగ్గించామని తెలిపారు. మెుత్తం ఆర్టీసీ 6,500 కోట్లు ఖర్చులు ఉన్నట్లు తెలిపారు.   

Follow Us:
Download App:
  • android
  • ios