కడప జిల్లాలో నిర్మిస్తున్న steel plant పర్యావరణ శాఖ అనుమతులను ఇచ్చింది.రూ.16,986 కోట్ల పెట్టుబడితో ఈ ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ఏడాదికి మూడు మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయనుంది.

కడప: కడప జిల్లాలో నిర్మిస్తున్న steel plant పర్యావరణ శాఖ అనుమతులను ఇచ్చింది.రూ.16,986 కోట్ల పెట్టుబడితో ఈ ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. ఏడాదికి మూడు మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయనుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా jammalamadugu అసెంబ్లీ నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు గ్రామాల మధ్య ఫ్యాక్టరీ నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం పూనుకొంది. ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న 3,148.68 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.పారిశ్రామిక అవసరాల కోసం గండికోట జలాశయం నుంచి 2 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ సర్కార్ అనుమతిని కూడా ఇచ్చింది.ఇనుము సరఫరా కోసం ప్రభుత్వం జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 

ముగ్గురు సీఎంల శంకుస్థాపనలు

2007 జూన్ 10న నాటి ముఖ్యమంత్రి Ys Rajasekhara Reddy కడప ఉక్కు పరిశ్రమ కోసం భూమిపూజ చేశారు. 20 మిలియన్ టన్నుల సామర్థ్యంతో బ్రహ్మణి ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ పరిశ్రమ ప్రారంభానికి అంబవరం గ్రామ సమీపంలో ఆయన పునాదిరాయి వేశారు.రూ. 20వేల కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను నిర్మిస్తామని ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ 29వేల ఎకరాల్లో నిర్మిస్తే బ్రహ్మణి స్టీల్ ని 10వేల ఎకరాల్లో అదే సామర్థ్యంతో నిర్మిస్తామని వెల్లడించారు.బ్రహ్మణి స్టీల్ పరిశ్రమ నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కంపెనీకి కట్టబెట్టిన భూమి చుట్టూ ప్రహరీ, ఒకటి రెండు భవనాల నిర్మాణం తప్ప అక్కడేమీ లేదు.రాజశేఖర్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రులు ఈ ఉక్కు ఫ్యాక్టరీపై శ్రద్ధ పెట్టలేదు.

also read:కారణమిదీ: మళ్లీ మొదటికొచ్చిన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటికే రాష్ట్ర విభజన జరిగింది. అవశేష ఆంధ్రప్రదేశ్ Chandrababu సీఎం అయ్యారు.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయంలో నిర్మిస్తామని చెప్పిన ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. గండికోట రిజర్వాయర్ ఎగువన ఉన్న కంబాలదిన్నెలో చంద్రబాబు ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు.4వేల ఎకరాల్లోనే స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామన్నారు.

 వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి తోడ్పడతామని చంద్రబాబు ప్రకటించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ నిర్మించడానికి పూనుకుందని, కేంద్రం సహకరించాలని నాడు సీఎం చంద్రబాబు కోరారు.చంద్రబాబు తాను పదవి నుంచి దిగిపోవడానికి ఐదు నెలల ముందు దీనికి శంకుస్థాపన చేశారు. కానీ పనులు ప్రారంభం కాలేదు. 

వై.ఎస్, చంద్రబాబు తర్వాత మూడోసారి 2019 డిసెంబర్ 23న Ys Jagan కూడా స్టీల్ ప్లాంట్ కు వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఈ ఫ్యాక్టరీని భాగస్వామ్య పద్ధతిలో ఏర్పాటుకు ఆసక్తిగల సంస్థల నుంచి రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌(ఆర్‌ఎఫ్‌పీ) ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

తొలుత దేశంలోని దిగ్గజాలైన టాటా, ఎస్‌ఆర్‌, జిందాల్‌, జేఎస్‌డబ్ల్యూ, వేదాంత సహా ఏడు ఉక్కు కంపెనీలు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. వాటి ఆర్థిక అంశాలను పరిశీలించిన తర్వాత భాగస్వామ్య సంస్థను పారదర్శకంగా ఎంపిక చేయడం కోసం గ్లోబల్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్టు అధికారులు తెలిపారు.